కాంగ్రెస్ ఎన్నికల వాయిదాను కోరుతోందా…?
రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చిన చిక్కుముళ్లను కాంగ్రెస్ పార్టీ విప్పటానికి నానాయాతన పడుతోంది. ఒకవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక, మరోవైపు రాష్ట్రపతి పాలనను విధించలేక ఎటూ పాలుపోకుండా ఉంది. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ స్థితిలో ఎంచేయాలా అని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం కాంగ్రెస్ ఎన్నికలు వాయిదా పడితే మేలని అలోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావడం కష్టం.. ఇప్పటికే నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇతర పార్టీలతో కొంత మంది అవగాహన చేసుకున్నారు. దీనితో ప్రజల్లో పార్టీ మీద కసితో ఉన్నారు. అంతేకాక దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి..కేంద్రంలో అధికారం రావడానికి గుండెకాయ వంటి అంధ్రప్రదేశ్‌ను వదులుకుంటే అధికారం చేపట్టడం కల్ల…అందుకే ఎన్నికలు కొంత కాలం వాయిదా పడితే మేలని ఆలోగా ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉన్న కోపం కొంత వరకైనా తగ్గవచ్చని అంచనాలు వేస్తోంది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సంకేతం కూడా కాంగ్రెస్ కలవరపాటుకు గురి అవుతోంది. ఒకవేల నిజంగా అలా జరిగితే ఆ మేరకు ఓట్లు, సీట్లు చీలిపోతాయి. అప్పుడు తెలంగాణ ఇచ్చి కూడా మనకొచ్చే ప్రయోజనం ఏంటని కూడా అంచనా వేస్తున్నారు.
అందుకే టీఆర్‌ఎస్ పార్టీని సైతం విలీనానికి తొందరపెట్టడం లేదు. అదే జరిగితే బిజెపికి ఇక ఎదురు లేకుండా పోతుంది. ఒక్క సారి బిజెపి పుంజుకుంటే ఇక దాన్ని నిలువరించడం కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ కొద్ది నెలలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి లేని తలనొప్పులను ఎందుకు తెచ్చుకోవాలి. ఎన్నికలు వాయిదా పడితే ఆమేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీమాంధ్రలో కాంగ్రెస్‌పై ఉన్న కోపాన్ని కొంత వరకూ తగ్గించుకుని తరువాతనే ఎన్నికలకు వెళ్లాలనే అలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. చూడాలి మరి నూటాపాతికేళ్ల పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఎన్నికల వాయిదాను కోరుకుంటోంది. మరి ఈ ఎత్తులు సీమాంధ్రలో పలించి కేంధ్రలో హాట్రిక్ (యుపిఎ-3) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో చూడాలి.